పాక్ ప్రభుత్వం ఇటీవల 1,667 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికోసం 32 వేల మంది యువతీయువకులు దరఖాస్తు చేసుకున్నారు. వీళ్లందరికీ రాత పరీక్ష నిర్వహించేందుకు చాలా ఖర్చవుతుందని, అంత ఖర్చును ప్రభుత్వం భరించలేదని అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. వచ్చిన అభ్యర్థులు అందరినీ ఇస్లామాబాద్ లోని స్టేడియంకు తరలించారు. ప్రేక్షకుల గ్యాలరీతో పాటు గ్రౌండ్ లోనూ వారిని కూర్చోబెట్టి పరీక్ష రాయించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.