శ్రీశైలం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గన్ మిస్ ఫైర్ ఘటనలో ఎస్ఐ ఓబులేసుపై సస్పెన్సన్ వేటు పడింది. ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి సస్పెండ్ చేశారు. డిసెంబర్ 26న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శ్రీశైలం పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలో ఎస్ఐ ఓబులేసుకు అధికారులు కీలక ప్రాంతాల్లో బందోబస్తు బాధ్యతలు అప్పగించారు. విధుల్లో ఉన్న ఎస్ఐ తన సర్వీస్ రివాల్వర్ మరిచిపోవడంతో.. శ్రీశైలం పోలీస్ స్టేషన్లోని ఆయుధాల గదిలో ఉన్న మరో తుపాకీ తీసుకున్నారు. దాన్ని పరిశీలించే క్రమంలో గన్ మిస్ ఫైర్ కావడంతో బులెట్ స్టేషన్ గదిలోని పై భాగానికి తాకింది. అయితే ఈ విషయాన్ని ఎస్ఐ గోప్యంగా ఉంచారు.