హర్యానా క్రీడల శాఖ మాజీ మంత్రి సందీప్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించిన మహిళా అథ్లెటిక్ కోచ్ సంచలన ఆరోపణలు చేశారు. తాను దేశాన్ని విడిచి వెళ్తే రూ.కోటి ఇస్తామంటూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. కేసు వాపస్ తీసుకోవాలని లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. అయితే, తాను చావుకి భయపడనని, సందీప్ సింగ్ కు శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు.