ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కంభం రహదారిలో ఆంజనేయస్వామి దేవస్థానం సమీపంలో మంగళవారం రాత్రి ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ దొంగతనంలో రూ. 4లక్షల విలువైన బంగారు నగలు దోచుకెళ్లినట్లు ఇంటి యజమాని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు దొంగ తనం జరిగిన ఇంటిని పరిశీలించారు. వరుస దొంగతనాలతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైనా పోలీసుల నిఘా పెంచాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.