కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో రోజుకు లక్షలాది కరోనా కేసువు నమోదవుతున్నాయి. దీంతో పలు దేశాలు చైనా నుండి ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ ఆంక్షలను చైనా ఖండించింది. దేశాలన్నీ కలిసి తమపై రాజకీయాలు చేస్తున్నాయని, రాజకీయాల్లో భాగంగానే తమ దేశంపై ఆంక్షలు విధిస్తున్నాయని ఆరోపించింది. దీనిపై తాము ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా, చైనాపై ఆంక్షలు విధించిన దేశాల్లో భారత్ తో పాటు అమెరికా, యూకే ఉన్నాయి.