పాములపై వాటి రకాలపై ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఫారెస్ట్ అధికారులు ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్నేక్ రీస్క్యూర్ మల్లికార్జున పాములు వాటి రకాలు ఎలా ఉంటాయి విషపూరితవి తదితర విషయాలపై విద్యార్థులకు వివరించారు. మంగళవారం రాత్రి త్రిపురాంతకం మండలం డి. వి. ఎన్ కాలనిలో పట్టుకున్న తాచుపామును అక్కడ వదిలి వాటి గురించి వివరించారు. పాములు కనిపిస్తే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. రేంజర్ నీలకంఠ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీధర్ నాయుడు, విద్యార్థులు పాల్గొన్నారు.