చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు వైసిపి ఇన్చార్జిగా నియమితులైన నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి చెందిన అధికారులు వైసీపీ నేతలు, కార్యకర్తలు, బుధవారం వేటపాలెం మండలం పందిళ్ళపల్లి లోని ఆయన నివాసం వద్ద బారులు తీరారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. కలవడానికి వచ్చిన ప్రతి పర్చూరు నియోజకవర్గం అధికారిని, నేతను, కార్యకర్తను ఆమంచి కృష్ణమోహన్ సాదరంగా పలకరించి అక్కడి వివరాలను తెలుసుకుంటున్నారు.
ఆమంచిని కలిసిన అధికారులలో ఇంకొల్లు ఎండిఓ కృష్ణ, ఈవో పి ఆర్ డి శ్రీనివాసరావు, ఇంకొల్లు సీఐ సూర్యనారాయణ, ఆ సర్కిల్లోని ఎస్ఐలు నాయబ్ రసూల్, అనూక్, మేదరమెట్ల ఎస్సై శివకుమార్ తదితరులు ఉన్నారు. ఇక నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులు, ఆగ్ర నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa