చెన్నైలో ఓ వివాహిత దారుణానికి పాల్పడింది. రామర్ (40), కన్మణి (35) భార్యాభర్తలు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. 20 ఏళ్ల అరుల్ కుమార్తో కన్మణి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడితో పారిపోయేందుకు కన్మణి ప్లాన్ వేసింది. భర్త వద్ద ఉన్న నగదును కాజేయాలని అనుకుంది. ప్రియుడితో కలిసి భర్తపై డిసెంబర్ 28న ఆమె దాడి చేసింది. అనంతరం రోడ్డుపై రామర్ను వారు పడేశారు. రామర్ను బంధువులు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ డిసెంబర్ 31న చనిపోయాడు. పోలీసుల విచారణలో నిందితులు నేరం అంగీకరించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.