రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు ఏడాది కావొస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సైనికుడు ఒకరు తన భార్య గర్భిణీ అయినప్పటికీ.. ఆమెను ఇంటి వద్దే వదిలేసి రష్యాపై పోరుకు కదిలాడు. 30 వారాలు రష్యాపై యుద్ధం చేసి ఇటీవలే ఇంటికి తిరిగివచ్చాడు. అయితే చాలా రోజుల తర్వాత తన భర్తను చూసిన భార్య తీవ్ర ఉద్వోగానికి లోనై అతన్ని గుండెలకు హత్తుకుని ఏడ్చింది. వారి ప్రేమానురాగాలకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ గా మారింది.