టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. " పెద్దిరెడ్డి తమాషా చేస్తున్నావా.. నీ తడాఖా ఏంటో చూస్తా. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి ఆనందం పొందుతావా? 14 ఏళ్లు నేను అనుకొని ఉంటే జిల్లాలో తిరిగేవాడివా? కుప్పం ప్రజల్ని యాభై కోట్లు కట్టాలంటావా? అసలు నువ్వు రాజకీయ నాయకుడివేనా?" అంటూ చంద్రబాబు మండిపడ్డారు.