కుడేరు మండలం కొర్రకోడు గ్రామంలో గురువారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఘనంగా జరిగింది. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డికి గ్రామస్తుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. విశ్వేశ్వరరెడ్డిపై అడుగడునా పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం మూడున్నరేళ్లుగా చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, అమలు చేస్తున్న పథకాలను వివరించారు. బుక్లెట్లు పంపిణీ చేశారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు చెప్పిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ప్రతి ఇంటి వద్ద ప్రజలు వారికి ఘనంగా స్వాగతం పలికారు. గతంలో తాము ఎదుర్కొన్న సమస్యలను, ఈ ప్రభుత్వంలో తమకు జరుగుతున్న మేలును వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.