మడకశిర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే ఈరన్న గురువారము విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏమైనా నీ జాగీరా జగన్ రెడ్డి ఏపీలో ఏమైనా ఎమర్జెన్సీ విధించావా కుప్పంపై ఏకంగా అప్రకటిత యుద్ధమే ప్రకటించారు వైసీపీ పోలీసులు బ్రిటీష్ చట్టానికి బూజు దులిపి అర్ధరాత్రి జీవో ఇస్తావు. తెల్లారేసరికి ఉల్లంఘిస్తావు చట్టం మీ ఎదుగూరి సంధింటికి ఎదురింటి చుట్టమా అని ప్రశ్నించారు. ప్రతిపక్షనేత చంద్రబాబు తన నియోజకవర్గంలో పర్యటించేందుకు నీ ఆంక్షలేంటి నీ కుతంత్రాలన్నీ కుప్పంలో ప్రయోగిస్తున్నావు. చంద్రబాబు ప్రచారరథం స్వాధీనం చేసుకున్నావు. కార్యకర్తల్ని నాయకుల్ని నిర్బంధించావు. ఎన్ని అరాచకాలకు పాల్పడినా నీపై ప్రజావ్యతిరేకత తగ్గదు అని చంద్రబాబుకి జనాదరణ ఇంకా పెరుగుతూనే ఉంటుందని 35 ఏళ్లుగా కుప్పం నీలాంటి కుట్రదారులని ఎంతోమందిని చూసింది. తెలుగుదేశం కోట కుప్పంలో నీ కుప్పిగెంతులు చెల్లవు అని పసుపుసైన్యం కదం తొక్కుతోంది అని నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు కుప్పం పర్యటన ఆపలేవు అని వ్యాకనించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, మాజీ ఎంపీపీ ఆదినారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రకాష్, మాజీ కన్వీనర్ రామాంజనేయులు, తాలూకా రైతు ఉపాధ్యక్షుడు దయానంద, రమేష్, శ్రీనివాసులు, ఈశ్వర్ సాగర్, మాజీ డీలర్ నాగరాజు, పాల్గొన్నారు.