కందుకూరులో జరిగిన మారణకాండకు చంద్రబాబు బాధ్యత వహించాలని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమాయకుల ప్రాణాలు బలికావడానికి చంద్రబాబే కారణమన్నారు. కందుకూరులో నిబంధనలు పాటించి ఉంటే అమాయకులు బలయ్యేవారు కాదన్నారు. చంద్రబాబు ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని, ఆయనకు కనీస సంస్కారం లేదన్నారు. వారం రోజులుగా చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారు. పోలీసు యాక్ట్‌కు లోబడే ప్రభుత్వం జీవో తీసుకువచ్చింది. ఈ నిర్ణ“ం అన్ని పార్టీలకు వర్తిస్తుంది. జీవోను ఉల్లఘిస్తామని టీడీపీ ఛాలెంజ్ చేస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించడం సబబు కాదని సూచించారు. కుప్పానికి చంద్రబాబు దండయాత్రలా బయల్దేరారు. సభలు పెట్టుకోవద్దని చంద్రబాబుకు ఎవరూ చెప్పలేదన్నారు. ఇరుకైన ప్రాంతాల్లో మాత్రమే సభలు వద్దని కుప్పంలో చంద్రబాబుకు పోలీసులు సూచించారని చెప్పారు.