శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండలం దుద్దెబండ రైతు భరోసా కేంద్రం నందు రబీ వేరుశనగ పొలంబడి కార్యక్రమంలో భాగంగా రైతు బాల సుబ్రహ్మణ్యం పొలంలో ఏ డి ఏ స్వయం ప్రభ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కదిరి వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు వేమన, నీలిమ పాల్గొని వేరుశనగ పంటలో పక్షి స్థావరము, జిగురు అట్టలు, ఆకులు కత్తిరింపు పద్ధతులు, కలుపు మరియు సమగ్ర పంటల యాజమాన్యం పద్ధతులు గురించి రైతులకు వివరించుట జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సురేంద్ర నాయక్, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ముకుంద , రైతు భరోసా సిబ్బంది జయరాం, భాను, మౌనిక, రైతులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa