శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్ ఇచ్చింది. కొండపైన వసతి గదుల అద్దెలను భారీగా పెంచింది. ఇటీవలే తెరిచిన నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత వసతిగృహాల్లో ధరలను రూ.500, 600 నుండి రూ.1000కు పెంచింది. నారాయణగిరి గెస్ట్ హౌస్ అద్దెను రూ.750 నుండి రూ.1700కు, కార్నర్ సూట్ అద్దెను రూ.2,200 చేశారు. సామాన్య భక్తులు వసతిపొందే రూ.50, 100 అద్దె గదుల్లోనూ వసతులు కల్పించి ధరలు పెంచేందుకు టీటీడీ సిద్ధమైంది.