ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి వద్ద డాక్యుమెంట్ ఫోల్డర్లలో హెరాయిన్ ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ.31.29 కోట్లు ఉంటుందని అంచనా. ఇక ఇథియోపియా ఎయిర్ లైన్స్ విమానంలో వచ్చిన మరో వ్యక్తి కుర్తా గుండీల్లో 1.596 కిలోల కొకైన్ ను గుర్తించి అరెస్ట్ చేశారు. దీని విలువ రూ.15.96 కోట్లు ఉంటుందని అధికారులు ప్రకటించారు.