పద్మావతి మహిళా యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీగా ప్రొఫెసర్ కె.రాజారెడ్డి నియమితులయ్యారు. శనివారంతో వీసీ జమున మూడేళ్ల పదవీ కాలం పూర్తి కానుంది. దాంతో ఈ స్థానంలో ఎస్వీయూ వీసీని ఇన్‌చార్జి వీసీగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు శుక్రవారం జారీ చేశారు. రాజారెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa