రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని రైలు రోకో చేసిన మహిళా నేతలు విజయవాడలోని రైల్వేకోర్టులో శుక్రవారం హాజరయ్యారు. కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, సీపీఐ మహిళా నేత దుర్గాభవానీతోపాటు 13 మందిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో తొమ్మిది మంది విచారణకు హాజర య్యారు. కేసును న్యాయమూర్తి ఈనెల 13కు వాయిదా వేశారు.