పోలవరం ప్రాజెక్టు ముంపు జలాలపై కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ పలు రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించనుంది. ఏపీ, తెలంగాణ, ఒడిశా,ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సీఎంలతో ఫిబ్రవరి మొదటివారంలో ఈ సమావేశం జరగనుంది. దీనిపై ఇప్పటికే ఆయా రాష్ట్రాల సీఎంలకు సమాచారం అందించారు. పోలవరం ముంపుపై పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేంద్రం ఈ భేటీ నిర్వహిస్తోంది.