మంగళవారం గౌహతి స్టేడియంలో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 373/7 పరుగులు చేసింది. దీంతో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 306 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ సనక 108, నిస్సాంక 72 పరుగులతో పోరాడారు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లు, షమీ 2 వికెట్లు తీశారు.