కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. చలిగా ఉన్నప్పటికీ తాను గజ గజ వణికే వరకూ స్వెట్టర్ వేసుకోనని చెప్పారు. జోడో యాత్ర మధ్యప్రదేశ్ చేరుకోగానే కాస్త చలి మొదలైంది. ఒకరోజు ముగ్గురు పేద అమ్మాయిలు చిరిగిన బట్టలతో వణుకుతూ నా దగ్గరకు వచ్చారు. వాళ్ళని చూసి ఆ రోజు డిసైడ్ అయ్యాను. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ పాదయాత్రలో టీ షర్ట్ ను మాత్రమే ధరించాలని నిర్ణయం తీసుకున్నాట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు.