ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల డైరీలు, క్యాలెండర్లను ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి వైయస్.జగన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కే ఆర్ సూర్యనారాయణ, అసోసియేషన్ ప్రతినిధులు జి ఆస్కార్ రావు, జి ఎం రమేష్ కుమార్లు ఉన్నారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.