సరుబుజ్జిలి మండల పరిధిలోగల సుభద్రాపురం గ్రామంలో ఆర్బిఐ ఆదేశాల మేరకు యూనియన్ బ్యాంకు వారి సౌజన్యంతో ఎస్. ఎస్. టి స్వచ్ఛంద సంస్థ వారు ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు అవగాహన గురువారం కల్పించారు. ఆన్లైన్ లావాదేవీలపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సైబర్ నేరాల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఎఫ్ఎల్ సిబ్బంది సిహెచ్ వెంకటేష్, రామారావు, సర్పంచ్ తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు