భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని పేర్కొంటూ, దేశాన్ని ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల జాబితాలోకి తీసుకెళ్లడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్నారు.దీనివల్ల యువతకు అనేక అవకాశాలు లభిస్తాయని ప్రధాని అన్నారు.హుబ్బళ్లిలో జరిగిన జాతీయ యువజనోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.దేశంలోని క్రీడలను ప్రస్తావిస్తూ ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రధాన శక్తిగా మారే దిశగా పయనిస్తోంది అని అన్నారు. స్పోర్ట్స్‌లో కూడా ప్రపంచ శక్తిగా ఎదగడానికి భారతదేశం ముందుకెళ్తోందని, యువత సామర్థ్యం వల్లనే ఇది సాధ్యమవుతుందని అన్నారు.