రాష్ట్రంలో అభివృద్ధి నిరోధక వైసీపీ ప్రభుత్వా నికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని టీడీపీ రాజంపేట అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పిలుపునిచ్చారు. గురువారం కడప జిల్లా, నిమ్మనపల్లె మండలంలోని రాచివేటి వారిపల్లె గ్రామ పంచాయతీలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని మాచిరెడ్డిగారిపల్లె, గొల్లపల్లె, వడ్డిపల్లె, మాలపల్లె, ఆచార్లపల్లెల్లో నిర్వహించి టీడీపీ జెండాలతో ప్రతి ఇంటికి తిరుగుతూ వైసీపీ ప్రభు త్వం చేస్తున్న అన్యాయాలను అక్రమాలను వివరించారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతూ ఇష్టారాజ్యంగా భూదందాలకు పాల్పడు తున్నారన్నారు. వృద్ధాప్య పింఛనను 3000లను ఇస్తామన్న వైసీపీ ప్రభుత్వం 4ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికి ఇవ్వలేదన్నారు.వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించి చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రిని చేయాలన్నా రు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకటరమణ, నాయకులు మునిరత్నం, మురళి, మల్లిఖార్జున, బాబు, మధుబాబు, రామక్రిష్ణ, రామచంద్ర, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.