భార్యను చంపి ఇంట్లోనే పాతిపెట్టాడు కేరళకు చెందిన ఓ వ్యక్తి. ఎర్నాకులంకు చెందిన సంజీవ్ ఫిబ్రవరి 2022లో తన భార్య కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య వేరేవారితో లేచిపోయిందని బంధువులను నమ్మించాడు.18 నెలల తర్వాత కేసును ఛేదించిన పోలీసులు, భార్యను భర్తే హతమార్చినట్లు గుర్తించారు. మనస్పర్ధల కారణంగా భార్యను హతమార్చిన సంజీవ్, ఇంటికి సమీపంలోనే శవాన్ని పాతిపెట్టాడు.