ఉత్తర భారతదేశంలో చలి వాతావరణం కొనసాగుతుంది. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పడిపోతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చలి తీవ్రత కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని ఆసుపత్రుల్లో శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ రోగుల సంఖ్య 50 నుంచి 60% పెరిగినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అలాగే గుండెపోటు వంటి తీవ్ర సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు.