శ్రీశైలంలో జగద్గురు ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి జరుతున్న రాష్ట్రీయ ధర్మ సమ్మేళనం కార్యక్రమం లో పాల్గొనేందుకు శ్రీశైలం విచ్చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కు స్థానిక బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు. నంద్యాల పార్లమెంట్ బిజెపి అధ్యక్షుడు డా. బి. శ్రీకాంత్ రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అయన వెంట పలువురు బిజెపి నాయకులు ఉన్నారు.