రాజస్థాన్ హైకోర్టులో కొత్త న్యాయమూర్తుల నియామకాన్ని లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖ శుక్రవారం నోటిఫై చేసింది.ఈ తొమ్మిది నియామకాల్లో ఆరుగురు న్యాయాధికారులు కాగా, ముగ్గురు న్యాయవాదులు రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. రాజస్థాన్ హైకోర్టులో కొత్తగా నియమితులైన న్యాయమూర్తులందరికీ లా అండ్ జస్టిస్ మినిస్టర్ కిరెన్ రిజిజు కూడా శుభాకాంక్షలు తెలిపారు.తాజాగా, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామక ప్రక్రియకు సంబంధించి కాలక్రమానికి కట్టుబడి ఉంటామని కేంద్రం ప్రభుత్వం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. కేంద్రం తరపున వాదిస్తున్న అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న 104 సిఫార్సులలో 44 త్వరలో ప్రాసెస్ చేయనున్నట్లు కోర్టుకు తెలియజేశారు.