జీవితంలో ప్రతి ఒక్కరూ చుండ్రు సమస్యతో బాధపడుతున్నారు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. నిమ్మరసంలో కొబ్బరినూనె మిక్స్ చేసి తలకు బాగా పట్టించి రెండు గంటల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత, రసాయనాలు తక్కువగా ఉండే షాంపూతో శుభ్రంగా తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. జుట్టుకు ఆలివ్ ఆయిల్ అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి. అరగంట సేపు వేచి ఉండి కడిగేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి.