ప్రఖ్యాత ఫార్మసీ కంపెనీ సన్ ఫార్మా తమ ఉత్పత్తుల విషయంలో కల్తీకి పాల్పడుతున్నట్లు అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ వార్నింగ్ ఇచ్చింది. గుజరాత్ లోని హలోల్ ప్లాంట్ లో మందుల తయారీలో లోపం తలెత్తుతున్నట్లు పేర్కొంది. మందుల తయారీ సమయంలో సూక్ష్మ జీవుల కంటామినేషన్ జరగకుండా ఆ కంపెనీ చర్యలు తీసుకోవడం లేదని తెలిపింది. ఈ క్రమంలో వార్నింగ్ లెటర్ కూడా జారీ చేసింది.