చైనాలోని గ్వాంగ్జౌ నగరంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. పాదచారుల పైకి ఓ వ్యక్తి వేగంగా కారును పోనిచ్చాడు. దీంతో కారు ఢీకొని ఐదుగురు చనిపోయారు. మరో 13 మంది గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన 22 ఏళ్ల యువకుడిని చైనా పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ కారు దిగి కరెన్సీ నోట్లను గాలిలోకి విసిరాడు. కావాలనే అతడు ఈ యాక్సిడెంట్ చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.