ప్రజల చేత ఎన్నికైన ఓ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను తగులబెట్టడం అంటే భారతీయ చట్టం, ప్రజాస్వామ్యం పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించడమేనని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతి వేడుకల కోసం స్వగ్రామం నారావారిపల్లె వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు వివాదాదస్పద జీవో నెం.1 ప్రతులను భోగిమంటల్లో వేయడం తెలిసిందే. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పై విధంగా స్పందించారు. ఇవాళ జీవో ప్రతులను తగులబెట్టాడు... రేపు రాజ్యాంగాన్ని తగులబెడతాడేమో! అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. "గతంలో ఒకరు బహిరంగంగా ప్రభుత్వ పత్రాలను చించివేసినప్పుడు ప్రజలు ఏమనుకున్నారో అందరికీ తెలుసు. నియంత పోకడలు అంటే ఇవే" అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa