ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమాపై చర్చ సాగుతోంది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వ నైపుణ్యానికి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల నటనా ప్రతిభకు మచ్చుతునకలా నిలిచిన చిత్రం ఆర్ఆర్ఆర్. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల కుంభవర్షం కురిపించిన ఈ చిత్రం అవార్డుల పరంగానూ దూసుకెళుతోంది. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల రిమైండర్ జాబితాలో చోటుదక్కించుకున్న ఆర్ఆర్ఆర్ కు అమెరికాలో నీరాజనాలు పలుకుతున్నారు. ఈ చిత్రంలో 'నాటు నాటు' పాటకు ఇటీవల గోల్డెన్ గ్లోబ్ పురస్కారం లభించడం తెలిసిందే. తాజాగా బెస్ట్ మ్యూజిక్ కేటగిరీలో లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు కూడా వరించింది. ప్రస్తుతం అమెరికాలోనే ఉన్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ అవార్డు అందుకున్నారు. ఈ మేరకు ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ట్విట్టర్ లో వెల్లడించింది. కీరవాణికి అభినందనలు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa