గుజరాత్ లోని బొటాడ్ లో ఎనిమిదేళ్ల బాలిక శవం అర్ధనగ్నంగా కనిపించడం కలకలం రేపింది. ఆదివారం బాలికను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని.. భగవన్ పొరా ప్రాంతంలో ఆమె శవం కనిపించిందని పోలీసులు తెలిపారు. బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.