ఝార్ఖండ్ పశ్చిమ సింగ్ భూమ్ జిల్లా ఖాంట్ పానీలోని కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతోన్న బాలికలను అక్కడి వార్డెన్ వేధింపులకు గురి చేస్తున్నారట. దీంతో విసిగిన దాదాపు 60 మంది 11వ తరగతి విద్యార్థినులు సోమవారం రాత్రి 17 కి.మీ నడిచి వెళ్లి బృందంగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. ఉదయం 7 గంటలకు చేరుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుపుతామనడంతో ఆందోళన విరమించారు.