ఈ నెల 19వ తేదీన వేమన జయంతి పురస్కరించుకొని, ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలను నిర్వహించనుంది. ఈ మేరకు అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు వెల్లడించారు. విజయవాడలోని ఎస్ఆర్ఆర్, సీవీఆర్ డిగ్రీ కళాశాలల్లో నిర్వహించే ఈ ఉత్సవాల్లో విద్యార్థులకు వేమన పద్య పఠన పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆసక్త గల విద్యార్థులు తమ గుర్తింపు కార్డుతో రేపు ఉ.9 గంటల్లోగా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.