ఆస్ట్రేలియా క్యారమ్ డౌన్స్ లోని శ్రీ శివవిష్ణు ఆలయంపై కొందరు దుండగులు సోమవారం దాడి చేశారు. ఆలయం గోడలపై భారత్ కు వ్యతిరేకంగా రాతలు రాశారు. ఈ ఘటనపై స్పందించిన స్థానిక ఎంపీ బ్రాడ్ బట్టిన్.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల 12న మెల్ బోర్న్ లోని స్వామి నారాయణ్ ఆలయంపై కూడా దుండగులు దాడి చేసి ‘హిందూస్థాన్ ముర్దాబాద్’ అని గోడలపై రాశారు.