చికెన్ కొనుగోలు విషయంలో గొడవ కర్ఫ్యూ విధించే వరకు వెళ్లింది. యూపీలోని అలీఘడ్ జిల్లా సరాయ్ సుల్తానీలోని ఓ మాంసం దుకాణానికి ఇద్దరు యువకులు వెళ్లారు. ఈ సమయంలో దుకాణదారుడికి, యువకులకు మధ్య వాగ్వాదం జరిగి, ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. అనంతరం ఇరువర్గాల వారు అక్కడకు చేరుకుని రాళ్లదాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు గ్రామంలో కర్ఫ్యూ విధించారు.