తమిళనాడులోని పుదుకోట్టైలో మంగళవారం ఘోరప్రమాదం జరిగింది. జల్లికట్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా వన్నియన్ విదుతి ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కార్గో వాహనం ఎదురుగా వస్తున్న ప్రభుత్వ బస్సును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. 11 మందికి గాయాలయ్యాయి. రెండు ఎద్దులు కూడా మృతి చెందాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa