ఉమ్మడి రాష్ట్రం విడిపోయే సందర్భంగా కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూల్ లో ఏర్పాటు చేయాలని శ్రీ బాగ్ వుడంబడికలో కూడా తీర్మానం చేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నది బోర్డు కార్యాలయాన్ని ని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తామన్నడం రాయలసీమ ప్రాంత రైతులకు ద్రోహం చేసినట్టు అని రైతు సేవా సమితి ప్రధాన నాయకుడు ఏవి రమణ. ప్రజాపక్షం కన్వీనర్ గోశెట్టి వెంకటరమణయ్య లు అన్నారు.
బుధవారం మైదుకూరు లో జరిగిన నిరసన సందర్భంగా వారు మాట్లాడుతూ. రాష్ట్రంలో మూడు రాజధానులు అంటూ కర్నూల్ నాయా రాజధాని అంటూ రాయలసీమ గర్జన జరిపినటువంటి ప్రభుత్వం ఈరోజు రాయలసీమ ప్రాంత ప్రధాన నీటి వనరు అయినటువంటి కృష్ణానది దానిలో అంతర్భాగ మైనటువంటి శ్రీశైలం, తెలుగు గంగ, కేసీ కెనాల్ లాంటి ప్రాజెక్టు సమస్యలు చర్చించుకునేందుకు యాజమాన్య బోర్డు అయినటువంటి కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూల్ లో కాకుండా విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తామన్నడం చాలా దారుణమని ఇటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోకపోతే రాయలసీమ ప్రాంత రైతాంగం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని వారు చెప్పారు.
ఈ సమస్య పరిష్కారం అయ్యేవరకు మైదుకూరు నియోజకవర్గం లో రైతు సేవా సమితి ఆధ్వర్యంలో, ప్రజాపక్షం, ఎమ్మార్పీఎస్, అలాగే ఇతర ఉద్యమ సంఘాలను కలుపుకొని ఉద్యమిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ రైతు నాయకులు కాజీపేట ఎరుకల రెడ్డి, రాజా, మైదుకూరు రైతు నాయకులు, సహదేవ్, మురళి, లెక్కలవారిపల్లె శ్రీనివాసులు రెడ్డి, ఓబులేష్, రమేష్, కత్తి నాగిరెడ్డి ఎమ్మార్పీఎస్ నాయకులు దువ్వూరు నారాయణ తదితరులు పాల్గొన్నారు.