విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశాల మేరకు బుధవారం వేపాడ మండలంలో వల్లంపూడి ఎస్ఐ రాజేష్, సిబ్బంది కోడి పందెల స్థావరాలపై దాడులు నిర్వహించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని, వారి దగ్గరి నుంచి 4 కోడి పుంజులు, రూ.500ల నగదు స్వాధీనం చేసుకున్నారు. కోడి పందెలు, జూద క్రీడలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రాజేష్ హెచ్చరించారు.