అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రేణుమాకులపల్లి సమీపంలో ఆటోలో నుంచి జారిపడి కర్ణాటక రాష్ట్రం హోస్పెట్ కు చెందిన ఎర్రిస్వామి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రేణుమాకులపల్లిలో ఊరి దేవర కార్యక్రమం ముగించుకుని ఆటోలో ఉరవకొండకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అత్యవసర వాహనంలో ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం బళ్లారి ఓపిడికి తరలించినట్లు సమాచారం తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa