పట్టాభద్రుల ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని భారతీయ జనతా పార్టీ మైదుకూరు నియోజకవర్గం ఇంచార్జ్ మాచనూరు సుబ్బ రాయుడు అన్నారు. గురువారం మైదుకూరు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు కర్నాటి ఎల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి భూమిరెడ్డి భాస్కర్ రెడ్డి లు హాజరై మాట్లాడుతూ. భాజాపా ఎమ్మెల్సీ అభ్యర్థి నగరూరు రాఘవేంద్ర ను గెలిపించాలన్నారు. అనతరం క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.