కర్నూలు నగరంలోని కొత్త బస్టాండు ఎదురుగా ఉన్న యూకాన్ షాపి కాంప్లెక్స్‌లో అక్రమంగా నిర్మించిన అనధికార నిర్మాణాలను తక్షణమే తొలగించాలని దుకాణ యజమానులు డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలను కూల్చాలని కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని కోరుతూ దుకాణ యజమానులు బుధవారం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వారం రోజుల్లో దుకాణాలు తొలగిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారని, అయితే ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని యజమానులు ప్రశ్నించారు. రెండో పట్టణ ఎస్ఐ అధికారులతో సంప్రదించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దుకాణ యజమానులు కమిషనర్‌ను కలిసేందుకు వెళ్లగా వెనక దారి నుంచి బయటికి వెళ్లిపోయారు.