ట్రెండింగ్
Epaper    English    தமிழ்

23, 24 తేదీల్లో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 20, 2023, 02:37 PM

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఈ నెల 23, 24 తేదీల్లో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేస్తు న్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ వర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు భీమవరం ఆనంద ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేస్తున్నామని, కేంద్ర మంత్రులతో పాటు, పార్టీ ముఖ్య నాయకులు 400 మంది ఆహ్వానితులు పాల్గొంటారని వివరించారు. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఈ సమావేశాల్లో బీజేపీ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే జాతీయస్థాయి కార్యవర్గ సమావేశాలు పూర్తి అయిన నేపథ్యంలో రాష్ట్ర సమావేశాలు ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయని అన్నారు. జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ మాట్లాడుతూ...  ముందుగా పార్టీ ముఖ్యనాయకులు శక్తి కేంద్రాల,బూత్‌ల వారిగా పార్టీ శ్రేణులతో మమైకమే రానున్న ఎన్నికలకు దిశా నిర్ధేశం చేస్తారని తెలిపారు. పార్టీ క్రమశిక్షణా సంఘం రాష్ట్ర చైర్మన్‌ పాకా వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర సమావేశాల్లో రాష్ట్రస్థాయి పొత్తులపై వివాదస్పద అంశాలపై ముఖ్య నాయకులు స్పష్టత ఇస్తారన్నారు. భీమవరంలో గతంలో నాలుగు పర్యా యాలు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించామన్నారు. త్వరలో జరగనున్న కార్యవర్గ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ సమావేశంలో కోమటి రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa