ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చోరీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 20, 2023, 02:37 PM

నరసాపురం, పట్టణంలోని నాలుగు రోజుల క్రితం చోరీ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి చోరీ సొత్తు రూ.7.5 లక్షల నగదు, 7 కాసుల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్ళితే...... స్థానిక జోశ్యులవారి వీధిలో నివాసం ఉంటున్న న్యాయవాది వెంకటరత్నం సంక్రాంతి పండుగ సందర్భంగా ఆదివారం ఏలూరు లోని అత్తగారింటికి కుటుంబ సభ్యులతో వెళ్లారు. సోమవారం ఉదయం ఇంటి తాళాలు పగులకొట్టి ఉండడంతో స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఆయన తిరిగి వచ్చి ఘటనపై పోలీసులకు ఫిర్యా దు చేశారు. నేరం జరిగిన తీరును పరిశీలించి పాత నేరస్తులే ఈ చోరీకి పాల్పడి ఉంటారని సీఐ శ్రీనివాసయాదవ్‌, ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి, క్రైం ఇన్‌స్పెక్టర్‌ రెహమన్‌ కొంతమందిపై నిఘా పెట్టారు. ఈక్రమంలో పట్టణానికి చెందిన పాత నేరస్తుడు కొత్తపల్లి నరేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా న్యాయవాది ఊరు వెళ్లారన్న సమాచారంతో చోరీకి ప్లాన్‌ వేసి బీరా రమేష్‌ (కోనసీమ జిల్లా కొత్తపేట), గుబ్బల భాస్కర్‌ (నరసాపురం) సహకారంతో ఇంటితాళాలు పగులగొట్టి చోరీ చేసినట్టు ఒప్పుకున్నాడు. దీంతో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కేసును చేధించడంతో ప్రతిభ చూపిన సిబ్బందికి ఎస్పీ రివార్డులు ప్రకంటించారు. సమావేశంలో డీఎస్పీ మనోహారాచారి, సీఐ సురేష్‌బాబు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa