ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గణతంత్ర దినోత్సవం సందర్భంగా 23, 34, 25 తేదీల్లో క్రీడా పోటీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 20, 2023, 02:39 PM

గణతంత్ర వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్‌ డా. కె.మాధవీలత సూచించారు. గురువారం రాత్రి కలెక్టరేట్‌లో కలెక్టర్‌ మాధవీలత అధ్యక్షతన గణతంత్ర దినోత్సవ వేడుకలపై జాయింట్‌ కలెక్టర్‌ ఎం.తే జ్‌భరత్‌, మునిసిపల్‌ కమిషనర్‌ కె.దినేష్‌కుమార్‌, అదనపు ఎస్పీ రజని లతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. నూతనంగా జిల్లా ఏర్పాటు చేసిన తరువాత తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. పోలీసు, రెవెన్యూ, కార్పొరేషన్‌, విద్యుత్‌శాఖ, వైద్యఆరోగ్యశాఖ తదితర శాఖలకు చెందిన కార్యాచరణపై దిశానిర్దేశం చేసారు. ప్రాథమికంగా తొమ్మిది శాఖలకు చెందిన వాహన శకటాల ప్రదర్శన ఏర్పాటు చేయాలన్నారు. జనవరి 26న జిల్లాస్థాయి జాతీయ పతాకావిష్కరణకు తప్పనిసరిగా అధికారులు, సిబ్బంది హాజరు కావాలని ఆదేశించారు. సాంస్కృతిక కార్యక్రమాలనిర్వహణ కోసం ముందస్తుగా ప్రదర్శన ఇచ్చే వారి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 23, 34, 25 తేదీల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు.జేసీ తే జ్‌భరత్‌ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆర్ట్స్‌కళాశాల మైదానం లో జనవరి 26 గురువారం నిర్వహించడంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa