విశాఖ నగరంలో మత్తు ఇంజక్షన్లు కలకలం రేగింది. గాజువాకలో మత్తు ముఠా గుట్టు రట్టయింది. యాదవ జుగ్గరాజుపేట సమీపంలోని ఓ మెడికల్ షాపులో మత్తు ఇంజక్షన్లు అమ్ముతున్నట్టు గమనించిన స్థానికులు షాపుపై నిఘాఉంచారు. షాపులో నుంచి బయటకు వచ్చిన యువకుడు శ్మశానం సమీపంలో ఇంజక్షన్ చేసుకుంటున్న సమయంలో పట్టుకుని దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో షాపు యజమాని నక్కా మహేశ్వరరెడ్డి దగ్గర 35 మత్తు ఇంజక్షన్లు, నీడిల్స్, గంజాయి, సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa