మూడు రోజుల పాటు జరగనున్న ‘ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ డీజీ, ఐజీ’సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్‌లో జరిగే ఈ కాన్ఫరెన్స్‌లో రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల DGP, IGPలతో సహా పలువురు అధికారులు పాల్గొననున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో జైళ్ల సంస్కరణలు, వామపక్ష తీవ్రవాదం, తీవ్రవాద వ్యతిరేక సవాళ్లు, సైబర్ నేరాలు, పోలీసింగ్‌లో సాంకేతికతతో సహా అనేక అంశాలను చర్చించనున్నారు.